కన్నీటి కసి ...

నయవంచన నెమరువేస్తూ
నడివీధిన నేలకూలి
రాల్చేసెయ్ రాల్చేసెయ్...
కంటిపొరలు తొలగిస్తూ
పంటి బిగుతు సడలించి
కార్చేసెయ్ కార్చేసెయ్...

రాలిన ప్రతి బొట్టెగసీ
పర్వవేలా తరంగమై
సునామీలు సృష్టించనీ...

కారిన ప్రతి చుక్కరిచీ
ప్రహల్లాద హరిస్మరణై
గర్వాన్నే గద్ధించనీ...

ప్రపంచమే పులుముకొన్న
పాప భీతి పంకిలాన్ని
ప్రళయోధ్భవ కమలంతో
పారద్రోలి పారద్రోలి
ప్రకాశమే నింపనీ !
ప్రకృతినే పణమిల్లి
ప్రశాంతతను పంచనీ !!

10 comments:

  1. విష్వక్సేనగారు.....కోమలమైన కమలం కసితో కన్నీరు కారిస్తే, ప్రకృతిని ప్రశాంతతను పంచమంటారా?? ఇది ఎంతవరకు సబబు చెప్పండి :-) just kidding. Inspiring poem.

    ReplyDelete
    Replies
    1. మీ వేదనకి, నా రోదనకి సమాధానాలు దొరకునా? చెప్పండి..

      Delete
  2. ఆ కసికన్నీటి అంతటి శక్తి ఉందన్నమాట...సునామీలని సృష్టిస్తుంది

    ReplyDelete
    Replies
    1. అవునేమో... మీ మాటలతో నిజమనిపిస్తోంది అమ్మాయిగారు...

      Delete

  3. ఉద్వేగంతో మొదలైన మీ కవిత ఎంతో ఉత్తేజ పరిచింది నమ్మండి'
    అయితే చివరి మాటలు మాత్రం కాస్తా మనసుకు ఊరట గా ఓ పరిష్కారాన్ని అందించింది.

    "ప్రపంచమే పులుముకొన్న
    పాప భీతి పంకిలాన్ని
    ప్రళయోధ్భవ కమలంతో
    పారద్రోలి పారద్రోలి
    ప్రకాశమే నింపనీ !
    ప్రకృతినే పణమిల్లి
    ప్రశాంతతను పంచనీ !!"

    చాలా బాగా రాసారు.
    శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. హమ్మయ్య!! చక్కటి స్పందన!! ధన్యవాదాలు శ్రీపాద గారు

      Delete
  4. నిజంగానే మీ పదాలు పున్నమి ప్రతిభింబాలు, నుసి నోర్వని వెలుగు కెరటాలు, అద్భుత పదజాలం మీ సొంతం వినోద్ జి

    ReplyDelete
    Replies
    1. మేరాజ్ ఫాతిమా జి.. ఏంతో ఉత్తేజాన్ని కలిగించే స్పందన.. ధన్యవాదాలు. :-)

      Delete
  5. ఆ కసి కన్నీటిదే అయితే పర్వాలేదు అలా కరిపోనివ్వండి :-)

    ReplyDelete
    Replies
    1. నన్ను కూడా నీరు కారిపోమంటారా??

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...