పవిత్ర పొర రాల్చిన
నెత్తుటి ముద్దొకటి, ఏడ్పును -
కుత్తుకలో మోస్తూ
మృత్తికను అప్పుడెప్పుడో
హత్తుకుంది.
ఆత్రమో అవశ్యమో
ఆక్రంద కందు ఆకాంక్షో
ప్రేగుతో బంధం తెగింది.
ప్రపంచంతో సంబంధం కలిసింది.
ఆశలెన్నో శ్వాసించి
భుజాన రంగుల రెక్కల్ని మొలిపించుకుంది.
బాధలెన్నో భరించి
హృదయాన కాంతి రేఖను ప్రసరించుకుంది.
ఒక్కో మెట్టెక్కి
ఆరడుగులకు చేరువౌతూ
అంగుళం దూరాన ఆగిపోయింది.
ఆశయం మాత్రం అలానే వెలుగుతూ
గమనంలో గమ్యాన్ని ఇంకా చేరువౌతూనేఉంది.
30/12/2013

నెత్తుటి ముద్దొకటి, ఏడ్పును -
కుత్తుకలో మోస్తూ
మృత్తికను అప్పుడెప్పుడో
హత్తుకుంది.
ఆత్రమో అవశ్యమో
ఆక్రంద కందు ఆకాంక్షో
ప్రేగుతో బంధం తెగింది.
ప్రపంచంతో సంబంధం కలిసింది.
ఆశలెన్నో శ్వాసించి
భుజాన రంగుల రెక్కల్ని మొలిపించుకుంది.
బాధలెన్నో భరించి
హృదయాన కాంతి రేఖను ప్రసరించుకుంది.
ఒక్కో మెట్టెక్కి
ఆరడుగులకు చేరువౌతూ
అంగుళం దూరాన ఆగిపోయింది.
ఆశయం మాత్రం అలానే వెలుగుతూ
గమనంలో గమ్యాన్ని ఇంకా చేరువౌతూనేఉంది.
30/12/2013

జననం...
ReplyDeleteజీవితం...
టూకీ గా...
పూర్తి గా...
kudos...
This comment has been removed by the author.
ReplyDeleteఒక్కో మెట్టెక్కి
ReplyDeleteఆరడుగులకు చేరువౌతూ
అంగుళం దూరాన ఆగిపోయింది.
కొత్తదనం నచ్చింది.
ఒక మనిషి తన ఆశయాలను ఎంత ఉన్నతంగా పెంచుకోవాలో వివరించిన తీరు బాగుంది వినోద్ గారు .
ReplyDeleteఆగని పయనం. nice one sir:-)
ReplyDelete