దీక్ష


నువ్వు నాతోలేక
యుగాలు గడిచిపోయాయి...
మనం కన్న స్వప్నాలూ చెదిరిపోయాయి...
పగళ్లను కమ్మేస్తున్న చికటిపొరలతో
మన ప్రపంచం వెలుగుని కోల్పోయినట్టుంది...
అప్పుడొకసారి
దోసిట్లో తీసుకున్న నీ మొహం
ఇప్పుడు కన్నీరై వొలికిపోతోంది...
తడిబారిన జ్ఞాపకాల గుండెలోంచి
ఉబికొచ్చే రుధిరాహ్ని
నన్ను భగభగా కాల్చేస్తోంది...
నా దేహమంతా
ప్రజ్వలించే భావోద్వేగాలతో
ఇప్పుడు నీ దీక్ష చేయడమే నాకు మిగిలింది...


3 comments:

  1. ధీర్గ కాలం ధీక్షలు అవి చెయ్యకండి. అసలే కరోనా కాలం. :) (ఏ మాటకామాటే హృదయాన్ని ద్రవింపజేసే భావలహరి మీ ధీక్ష) :(

    ReplyDelete
  2. జ్ఞాపకాల దొంతెరలై కనుల ముందు తరాస పడే విరహ వేదనంత తడి చినుకుల హారాలై
    ఏకబిగిన టపటపటప లయ ధ్వనుల నడుమ జలపాతమై భావోద్వేగాలు చిందాడేదై
    ద్రవింపజేసే నయన కొలనున ఉబికి వచ్చే నీటి వెల్లువ ఆద్యాంతం చమత్కార తార్కాణం

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...