వొకానొక రాతిరి




పక్షానికోమారు నగ్నత్వం సవాలువిసిరిన వొక రాతిరి
హృదయపొరలను తడిపి
ప్రణయకోలాహలాన్ని కోరిన వేళ
వెన్నెల అమావాస్యను కప్పుకున్నపుడు....

రేరాజు వెలుగుల్ని వెక్కిరిస్తున్న
తారకల పొగరుని
తన చిరునవ్వులతో అణిచి
చురకలంటిస్తున్న శ్వేతకలువ స్పర్శకై
చలువ హృదయ చంద్రుడు
ఒక్కో మేఘాన్ని అద్దుకొని
ఒక్కో చినుకులా కొలనులో రాలిపోతున్నాడు...

అది వర్షపు హోరు కాదు
రెండుహృదయాల సంఘర్షణల జోరు
నడిరాతిరి కలువకై
చందుడు రాల్చిన
ప్రవహించెడి వన్నెలపొడి సెలయేరు.....

4 comments:

  1. తారకల పొగరుని
    తన చిరునవ్వులతో అణిచి
    చురకలంటిస్తున్న శ్వేతకలువ స్పర్శకై
    చలువ హృదయ చంద్రుడు
    ఒక్కో మేఘాన్ని అద్దుకొని
    అదరహో మీ అక్షరసంపద.

    ReplyDelete
  2. ఇలాంటి కవితలు చదివినప్పుడు మిమ్మల్ని ఎవరో ఆవహించి ఇలా రాయిస్తున్నారు అనిపిస్తుంది నాకు.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...