క....కవిత... | విష్వక్సేనుడు వినోద్



క్రమమేరుగని బాధాతరంగాల అలజడులతో
చాన్నాళ్ళుగా క్రమక్షయానికి గురైన హృదయాంతర తీరాలు
దీనావస్త నుండి నెమ్మదిగా ఒకసారి కోలుకోగానే
అక్షరాలు సుప్తావస్తను వీడి
పదాల్లో పరకాయప్రవేశం చేసినపుడు
మనసు కుదుటపడేలా
ఒంటరిగా కూర్చొని ఒక కవిత రాయాలనిపిస్తుంది!

జీవిత ఆటుపోట్లలో విధికి జడవక
మది భావాలను జాగురుకతతో ప్రతిబింబించి
ముందుకు నడిపించిన నా కళ్ళను
కలం జార్చిన సిరాక్షారాలతో అభిషేకించాలనిపించినప్పుడు
హృద్యంగా ఒక కవిత రాయాలనిపిస్తుంది!

మంచుపూలంటి ఆశయాలను అందబుచ్చుకునే ప్రయత్నంలో
ముళ్ళబాటల్లోనూ ధైర్యంగా అడుగులేసి
అలసిపోక శ్రమించిన కాళ్ళకి
పదాల్లో పద్మదళములు పరిచి సేదతీర్చాలనిపించినపుడు
ఖచ్చితంగా ఒక కవిత రాయాలనిపిస్తుంది!

16-05-2015

2 comments:

  1. జీవిత ఆటుపోట్లలో విధికి జడవక
    మది భావాలను జాగురుకతతో ప్రతిబింబించి
    ముందుకు నడిపించిన నా కళ్ళను
    కలం జార్చిన సిరాక్షారాలతో అభిషేకించాలని...అద్భుతంగా చెప్పారు

    ReplyDelete
  2. విష్వక్సేనుడు వినోదా నువ్వు కవిత వ్రాయాలంటే ఇన్ని ఆర్భాటలు కావాలా నాయనా :-) మొత్తానికి అదరగొట్టావు.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...