ఎం కావాలో తెలుసా ...

ఎం కావాలో తెలుసా ...

( రచన: వినోద్ )

స్వప్నించే నయనానికి తెలుసా?

రగిలే

హృదయాగ్ని జ్వాలలు.

ప్రశ్నించే పెదవికి తెలుసా?

తరిమే

దుఖసాగర తీరాలు.

తర్కించే తెలివికి తెలుసా?

పెరిగే

జీవన తారతమ్యాలు.

నిద్రించే మేనికి తెలుసా?

నడిచే

నరమంత్రపు సిరులు.

గద్దించే గర్వానికి తెలుసా?

గెలిచే

అణకువ మెళకువలు.

నడిచే అడుగులకి తెలుసా?

మలిచే

గమ్యపు అంచులు.

మనలో మనల్ని చుస్తే తెలుస్తుందా? ‘తెలుసా?’ ప్రశ్నకి తెలుసనే సమాధానం.

మనస్సులను తట్టిలేపే

స్పందనలు కావలి.

మానవత్వాన్ని పరిమలింపజేసే

మాటలు కావాలి.

మంచితనాన్ని మేల్కొలిపే

బాటలు కావాలి.

చెడు చేతబడులనేదిరించే

చేతన కావాలి.

బలిపశువుల తలరాతలను

మార్చి బ్రహ్మంగుళినేదిరించే అపూర్వ

లేఖిని కావాలి.

బానిసలను బంధ విముక్తులను చేసే

అనుబంధపు సంకెళ్ళు కావలి.

మనకి మాత్రమె కావాలనుకుంటే దొరుకుతుందా? మనకు కావాల్సిన ‘కావాలి’.

1 comment:

  1. ఇంకొక ఆవేశపూరిత ఆలోచనతో కూడిన మంచి కవిత.
    చిన్న చిన్న సవరణలు:
    గమ్యపు అంచులు. ---> గమ్యపుటంచులు. వ్యాకరణకార్యం పూర్తగానివ్వండి మరి. లేదా గమ్యం అంచులు అనండి విసంధిగా.
    పరిమలింపజేసే ---> పరిమళింపజేసే
    చేతబడులనేదిరించే --> చేతబడుల నెదిరించే (పదాల మధ్య దూరం ఉంచండి. మరియు ఎత్వం గమనించండి)
    బ్రహ్మంగుళినేదిరించే --> బ్రహ్మాంగుళి నెదిరించే ( బ్రహ్మ + అంగుళి --> బ్రహ్మాంగుళి . సంధి సవర్ణదీర్ఘం. షష్టీతతురుష సమాసం.)

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...