స్వేచ్ఛానురక్తి!

గాలి తరగల్లో 
చావూ బ్రతుకులనే
అప్రయత్న బిందువుల మధ్య
సరళహారాత్మక చలనంలా
ఊగిసలాడే జీవితానికి
ఎన్నెన్ని ఆంక్షలో...
న్యాయనికీ నిజానికి ఏర్పడ్డ అగాధాల మధ్య
బద్ధలయ్యే హక్కుల కోసం
హార్ట్ బీట్స్ లో కొన్ని టెక్టోనిక్ ప్లేట్స్
సృష్టించే ప్రకంపనల చీలిక దారుల్లో
నా స్వేచ్ఛకు రంగులద్దుకుంటూ
ఒక్కో బంధనాన్ని జారవిడచాలనిపిస్తుంది..
పుట్టగానే వో మతం రంగు పులిమేసి
కులం టాగ్ లైన్ తగిలించి
వో బలవంతపు బానిసత్వంలో నెట్టేసిన
యీ సోకాల్డ్ సాంప్రదాయ సమాజాన్ని
దాన్నుంచి బయటపడలేని అల్పజీవుల
జ్ఞానరహిత్యాన్ని దాటేసుకుంటూ
వో బుద్ధిజీవుడిలా వో విశ్వమానవుడిలా మారడానికి
కొన్ని సంభావ్యతలు లెక్కలేసుకుంటూ
మానవత్వం ధ్వనించే మార్గాన సాగే యీ నడక
యే మిల్కీ వే లో కలుస్తుందో....వో విష్వక్సేనుడా!
Pic: పికాసో

7 comments:

 1. అక్షరాల్లో అంతుచిక్కని ఆవేదన

  ReplyDelete
 2. అత్యద్భుతం మీ భావజాలం. ఇంతకు మించి వ్యాఖ్యలు లేవు.

  ReplyDelete
 3. జ్ఞానరహిత్యాన్ని దాటేసుకుంటూ
  వో బుద్ధిజీవుడిలా వో విశ్వమానవుడిలా...సూపర్ రాసావు బ్రదర్

  ReplyDelete
 4. చాలా మంచి భావాన్ని వ్యక్తం చేసావు.

  ReplyDelete
 5. హార్ట్ బీట్స్ లో కొన్ని టెక్టోనిక్ ప్లేట్స్ సృష్టించే ప్రకంపనలు..సైన్స్ పదాలు ఉపయోగించి బాగుంది మీ పోస్ట్

  ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...