ఎందుకో ఇదంతా నాకు నచ్చడం లేదు..!

చిన్న చేపను పెద్ద చేప, 
జింకను సింహం , 
మూర్ఖుడ్ని తెలివైన వాడు , 
పెదవాడ్ని ధనికుడు, 
చదువులేని వాడిని చదువుకున్న వాడు, 
బలహీనుడ్ని బలవంతుడు,
చిన్న  వాడిని పెద్దవాడు, 
తెలియని వాడిని తెలిసిన వాడు,
మంత్రిని రాజు, 
ఎలుకను  పిల్లి, 
పిల్లిని కుక్క,
ఇలా ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించుకోవడానికేనా ఈ సృష్టి ఉన్నది. 
ఇది  ఆధిపత్య పోరు కాదు., కేవలం ఆధిపత్యం మాత్రమే..! 
తరతరాలుగా నరనరాల్లో జీర్ణించుకున్న ఈ ఆదిపత్య పైత్యం వదిలేదెన్నడో..!? ఈ ఆదిపత్యానికి బలవుతున్నవారు బలహీనులే ( వ్రుత్తి పరంగా కావచ్చు, మేధస్సు పరంగా కావచ్చు, ఇంకా బలం వల్ల కావొచ్చు.). ఇది సృష్టి ఆడుతున్న చండాలమైన ఆట. ఇది నాకు నచ్చడం లేదు. ఒకడికి అన్నీ తెలిసినంతమాత్రాన ఇంకొకడి కూడా అదంతా తెలియాల్సిన అవసరం లేదు అలాగని తెలియని వాడు తెలిసిన వాడికి , లేని వాడు ఉన్న వాడికి బానిస కావాలా. నిజానికి ఇద్దరి తప్పు ఎక్కడా కనిపించకపోయినా తప్పు మాత్రం జరుగుతూ ఉంది. ఎందుకో నాకిదంతా నచ్చడం లేదు............!?!!?!?!   

1 comment:

  1. * సృష్టిలో తప్పేమీ లేదండి. ఏ హింసా లేని ఉత్తమమైన లోకాలూ ఉన్నాయట. అయితే అక్కడకు చేరాలంటే ఈ లోకంలో మంచిగా ప్రవర్తించి అర్హతను సంపాదించుకోవాలట.
    * ఒక వ్యక్తిని చిన్న ఉద్యోగంలోకి తీసుకోవాలన్నా ఎన్నో అర్హతలు, పరీక్షలు ఉంటాయి. మరి ఉన్నత లోకాలకు చేరాలంటే అర్హత ఉండాలి కదా !
    * పిల్లలు కష్టపడి చదవటం బాధను కలిగిస్తున్నా కూడా తల్లిదండ్రి చదవమనే ప్రోత్సహిస్తారు,.. వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని. ( అయితే వారి శక్తికి మించి చదవమని బాధపెట్టడానికి నేను వ్యతిరేకిని )
    * పూర్వం కొందరు పుణ్యాత్ములు ఇతర జీవులను కష్టపెట్టకూడదని నీరు, చెట్లనుంచి రాలి పడిన పండ్లు మాత్రం ఆహారంగా తీసుకుని జీవించేవారట, ఇతరజీవులంటే ఎంత జాలి ఉన్నా అలా జీవించటం అందరి వల్లా అయ్యే పనికాదుకదా !
    *మనుషులు తాము చేసిన పాపాల వల్ల మరుజన్మలో జంతువులు వంటి జీవుల్లా పుట్టి కష్టాలు అనుభవించటం జరుగుతుందట.
    *వ్యాఖ్య టపాలా పెద్దగా తయారయింది. సారీనండి..

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...