రెప్పలసలు లేని కంటికి కన్నీటి ధారలు అందాన్నిస్తాయా?
తలుపులు మూసిన మనసుకు తలపులు గాయం చేస్తాయా?
ఎద తడిమే జ్ఞాపకాల చినుకులు తనువునే తడిపెస్తాయా?
మరచిన అనుభూతుల కేరింతలు ప్రేమలో చిగురిస్తాయా?
ఊహలు దరిదాపులకు రాని ఆశలకు అపోహలు అడ్డోస్తాయా?
సమసిపోని గురుతులు స్పృహ కోల్పోయినా సేదతీరుస్తాయా?
సంతోషం పంచని సహవాసానికి బంధాలనే బాకులు గిరిగీస్తాయా?
ఓపికలేని వాంఛలెన్నో పాషాణ హృదయంతో పయనిస్తాయా?
సమ్మతి తెలుపని ఆశలు సమయం లేదంటు సర్దుకుపోతాయా?
ఎడతెరపి లేని కోర్కెలు ఓపిక లేదంటూ వేదనను భరిస్తాయా?
అదుపులేని ఆశయాలు అందిన ఆనందాలను కడతేరుస్తాయా?
కనిపించని జీవితపు దారులు బాధ్యతల చికాకులు మిగిలిస్తాయా?
ఇలా రోజుకొకటి ఎలా రాస్తున్నారో చెప్పండి. మొత్తానికి దీనివెనుక బలమైన హస్తం ఉందని నా నమ్మకం. ఆ ప్రేరణ ఎవరండి?
ReplyDeleteఇలా మీరు వచ్చి కామెంట్ పెడతారు అని తెలిస్తే రోజుకి పది కవితలు రాసేవాడిని తెలుగు అమ్మాయిగారు. ప్రేరణ ఎవరో మీకు తెలియదా!! Thank You!!
Delete