ఒకడూ ఇంకొకడూ
ఇద్దరూ వింత కవలలే!
అందరికీ తెలిసిన కవలలే!
ఎవ్వరూ గమనించని కవలలే!
ఒకడేమో ఎదో ఒకరంగులో,
ఇంకొకడు ఎప్పుడూ నలుపులో..
ఒకడేమో రంగులు మేనికి అద్దుతాడు.
ఇంకొకడికి అడ్డినా అంటుకోదు...
ఒకడేమో ఎప్పుడూ వాగుతాడు.
ఇంకొకడు వింటూనే ఉంటాడు.
ఒకడేమో నడుస్తాడు.
ఇంకోకడు వాడిని అనుసరిస్తాడు.
ఒకడేమో ఎదోఒకటి చేస్తాడు.
ఇంకొకడు వాడిని అనుకరిస్తాడు.
ఒకడేమో వస్త్రం ధరిస్తాడు.
ఇంకొకడు నగ్నంగా ఉంటాడు.
ఆ ఒకడేమో నేను.
ఇంకోకడు నా నీడ.
10/11/2013
అది మీరే ఇది మీరే :-)
ReplyDeleteమీరు చాలా తెలివైనవారు.. అమ్మాయిగారు
Delete