నా హృదయానికి ఓర్పెక్కువ







నా హృదయానికి ఓర్పెక్కువ
ధరిత్రిలా పాపాల్ని భరించెంత కాదు.!
నా ఆలోచనకు పదునెక్కువ
కత్తిలా రక్తాన్ని చిందించెంత కాదు.!
నా ఆవేశానికి అర్థమెక్కువ
ఆయుధంలా అభయాన్నిచ్చెంత కాదు.!
నా చేతలకు కర్తవ్యమెక్కువ
చంద్రుడిలా చీకటికి చేయూతనిచ్చెంత కాదు.!
నా బాధలకు భావాలెక్కువ
కన్నీరులా మనస్సును కరిగించెంత కాదు.!
నా అందానికి వెలుగెక్కువ
సూర్యుడిలా ఉష్ణాన్ని రగిల్చెంత కాదు.!
నా అడుగులకు బాధ్యతలెక్కువ
పశువులా మూర్ఖుల్ని పోషించెంత కాదు.!
నా తెలివికి తెగింపెక్కువ
ధీరుడిలా ధనువును విరిచెంత కాదు.!
నా కోపానికి కండకావరమెక్కువ
కడలిలా కెరటాల్ని ఉసిగొల్పెంత కాదు.!
నా ఊహలకు వైశాల్యమెక్కువ
విశ్వంలా నక్షత్రాల్నిముడ్చుకొనెంత కాదు.!

6 comments:

  1. మరీ అంత సహనం, ఓర్పు ఎక్కువైతే కష్టమే!

    ReplyDelete
  2. అన్నీ ఎక్కువే అని ఎత్తేసి....అంతలోనే అంతకాదు ఇంతకాదంటూ మమ్మల్ని కంఫ్యూజ్ చేస్తున్నారే కానీ, మీ భావాలకి అన్నీ సమపాళ్ళలో సవ్యంగా అమరాయని తెలిసిపోయిందిగా:-)

    ReplyDelete
  3. కవితల్లోనే కాదు కామెంట్ లో కూడా కంఫ్యూజ్ చేస్తున్నారే గమ్మత్తుగా...

    ReplyDelete
  4. మీ కవిత నాకు చాలా నచ్చిందండి.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...