లోతుతెలియని అగాధమంత నీ మనసుతో
అంతులేని ఆకాశమంటూ నన్ను కీర్తిస్తూ
నీలోకి సమ్మోహనంతో స్వాగతిస్తావు!
నీక్కావలసింది అర్థమైనట్లు మెల్లగా నిన్ను పరుచుకొని
నా దాహాన్ని దేహంతో తీర్చుకోవడానికని
తీయని ప్రయాసపడటానికి ప్రయత్నిస్తాను!
అచ్చం జీవితంలానే మొదట మెల్లగా ప్రాకుతూ
ఆపై నడక తర్వాత ఆపకుండా పరిగెత్తి
జీవన గమ్యాన్ని చేరుకున్నట్లు అలసిపోతాను!
నుదుటిపై జారే చెమట చుక్కని ముద్దాడుతూ
నీ కన్నీటి తడిని పరిచయం చేస్తావు!
వ్యధ నిండిన గాలిబ్ గానంలా
అందమైనదిగానే కనిపించే నీ మొహాన్ని
మోహపు మసక వెలుతుర్ల మధ్య వుంచి
కొన్ని బాధల్ని నవ్వులతో కలబొసి
నాపై నిట్టూర్పుతో వంపుతావు!
సహజంగానే నీ తలను నా గుండెలపై వుంచి
నిన్ను సేదతీరుస్తానోలేదో తెలియని నాపై
అసహజంగా ఒక బాధ్యతను మోపి
మన బంధానికి ఇంకాస్త రంగులద్దుతావు!
వ్యధను పంచుకొని బాధను కాసింత తుంచుకోవడానికి
ఎంతైనా ఈ రాత్రుళ్ళు కాస్త సహాయపడతానుకుంటూ
ఎంతోకొంత బోధపడినవాడిలా నీ ఒళ్లో తలపెట్టుకుని
కన్నీళ్లను తుడుస్తూ కాసేపు ప్రపంచాన్ని మరచిపోతాను!
అత్యద్భుతం అనే మాట అతిచిన్నది అన్నంత అద్భుతంగా రాసారు.
ReplyDeleteసున్నితంగా స్ట్రాంగా భావాలను వెల్లడించారు
ReplyDeleteLovable expressions in poem.
ReplyDeleteఎంతో అందంగా ఉన్నాయి మీ భావాలు.
ReplyDeleteవలపు కురిసింది మనసులో
ReplyDelete