ఆ కుర్చీకి కాళ్ళే లేవు !

ఎడారుల్లో ఎండమావుల్ని వెతుక్కుంటూ
ఎండిపోయిన గుండెలన్నీ
కన్నీటి మంటల్లో కొట్టుకుపోయి
టైటానిక్కును ముంచేసిన మంచు కొండల్ని
ఢీ కొట్టి మరీ పగిలిపోతున్నాయి.

చెల్లాచెదురైన ముక్కలన్నీ
పిచ్చిచూపులు చూస్తూ ఎదురుచూస్తున్నాయి.

వాడెవడో వచ్చి పూతమందు రాస్తాడని,
ఏదో టానిక్కిచ్చి ఠక్కున అతికిస్తాడని,
కొత్త రక్తాన్నెక్కించీ ఉత్తేజాన్ని రగిలిస్తాడనీ...

వాడెవడో రానేవచ్చాడు.
ఎన్ని కండువాలు మార్చాడో ఏమో!
ఖద్దరు చొక్కా అస్సలు నలగలేదు.
రెండు మంత్రాలేవో విసిరి
రాలిపడ్డ ముక్కల్ని తొక్కుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు.

పడుతూ లేస్తూ ఊగుతూ తూగుతూ
సరిగ్గా కూర్చోవడానికే ఐదేళ్ళు చాలడంలేదు.
మళ్ళీ విరిగిందిప్పుడు.
ఆ కుర్చీకసలు కాళ్ళే లేవు.

17/10/2013


2 comments:

  1. మొదటి పేరాలోనే కట్టి పడేసారు :-) చాలాబాగుంది.

    ReplyDelete
  2. కట్లు విప్పెసాను. తరువాత పేరాలూ చదవండి. (కిడ్డింగ్ .. :-) ధన్యవాదాలు. పద్మార్పిత గారు

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...