ముసుగులో ...

కనబడకుండా దాక్కుంటే
నిన్ను కనిపెట్టలేననుకున్నావా?

మాట్లాడకుండా మొహం చాటేస్తే
నీ కళ్ళలోని ఆప్యాయతని పసిగట్టలేననుకున్నావా?

నేను ప్రేమించింది నీ మనసును అయితే
నీ మేనికెందుకు ముసుగేసుకుంటావు?

ఆ ముసుగు నాకోసం కాదా?
అయితే ఎందరి హృదయాల్ని కొల్లగొట్టావ్?

నీ ముసుగుతో చేసే మ్యాజిక్కులకు పడిచచ్చే లోకాన్ని చూసి
సంతోషంతో గంతులేస్తూ సాగిపో

స్నేహానికి కొత్త నిర్వచనాన్నిచ్చి
కొలమానాలు లేని బావావాలతో
సనాతన సంస్కృతికీ అందని కొత్త బంధాన్ని సృష్టిస్తూ
వింతలోకంలో పరుగులు తీసేయ్..

ఎప్పుడూ ఆగకూడదనుకుంటావు.
ఎప్పుడో ఒకసారి ఆగాల్సిన పరిస్తితి వస్తుంది.

నీకున్న బాధలేవో నీవి.
నీకున్న భయమేదో నీది.
నీకున్న భావాలేవో నీవి.

" నేను నీ ముసుగు తొలగించాలి ప్రయత్నించడం లేదు.
నాకెందుకా అవసరం? " అంటూనే నీ ముసుగును నిందిస్తున్నా.
నా మనసును తెలిపేస్తున్నా..



4 comments:

  1. ఓరి తెలబాను! నీ నోట వేదాలు

    పక్కొడి కష్టాన్ని దొబ్బెసే తెలబాను

    కష్టపడే ఆంధ్రులకి నష్టం లేదురా

    నీ భవిష్యత్ పాకిస్తాన్ని చూసుకొరా తెలబాను

    ReplyDelete
    Replies
    1. అనానిమాస్ జి.. జ్ఞాన బోధ చేసారు... తాంక్యు

      Delete
  2. ఆహా....ఏం టాలెంట్, చెప్పకనే అన్నీ చెప్పేసారు :-)

    ReplyDelete
    Replies
    1. టాలెంట్ తొ తొక్కుడుబిళ్ల ఆడే మీకు ఇది టాలెంట్ లా అనిపించిందా? అలాగే తాంక్యు...

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...