అంతర్యాగం!



గడుస్తున్న జీవితాన్ని రాత్రుళ్ళు లెఖ్ఖలేసుకోవడం
మనకీమధ్య అలవాటైపోయింది...
కష్టాన్నో సుఖాన్నో - వలపునో - వేదన్నో
పారదర్శకంగా పంచుకోవడం పరిపాటైపోయింది...

మన మనసుల్లో మొలిచే మోహపు మర్రిచెట్టుకో అలవాటుంది...
తన్మయత్వంతో నగ్నత్వాన్ని ఆసరాకోరి
దమనిసిరల్లో ఎగసిపడే రక్తప్రవాహాల్తో
ఉచ్వాసల్ని ఊడలుగా విస్తరించి అలసిన తనువులని తృప్తిపరుస్తూ
నిచ్వాసల్లో మనస్సులని మమేకం చేస్తుంటుంది...

ఇరువురిని జతకూర్చిన
అపురూపమైన మన హృదయద్వయానికి
ఒక సంతృప్తతనిచ్చే వెచ్చని స్పర్శతో
అభిషేకించుకోకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుంది...


కరిగిన గుండెతో ఉప్పుంగే నువ్వు వో హిమనీనదానివి
నీ వెచ్చని కలయికతో పరవశించే నేను వో అగాధదరిని
అవిశ్రాంతంగా నాలో ప్రవహించడం నీవొంతు!
నిర్విరామంగా నిన్నైక్యం చేస్కోవడం నావొంతు!!

8 comments:

  1. దమనిసిరల్లో ఎగసిపడే రక్తప్రవాహాల్తో
    ఉచ్వాసల్ని ఊడలుగా విస్తరించి అలసిన తనువులని తృప్తిపరుస్తూ....ఇలా ఎన్నెన్నో అధ్భుతాక్షరాలతో మైమరపించారు.simply super vinodgaaru.

    ReplyDelete
  2. ఏంటి వినోద్ కొత్త హంగులతో ముస్తాబు చేసావు బ్లాగ్. చాలా అందంగా ఉంది. కవిత అదిరింది.

    ReplyDelete
  3. కొంచెం కష్టం అయిన అనుభూతి బాగుంది

    ReplyDelete
  4. ఔరా...ఈ మానవుడు కడు ప్రజ్ఞాశాలి వలె గోచరించు చున్నాడు :-)

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...