వచ్చిపోరా ఒక్కసారి...






ఆహ్లాదం పంచిన ఓ బాల్యమా! మళ్ళీ తిరిగిరావా
మది భావాల హోరును హాయిగా ఆస్వాదించేందుకు

వెంటనడిచే ఓ కాలమా! మరుపు మంత్రం చెప్పవా
మనసు మోయలేని భారాన్ని దింపుకొనేందుకు.

వెంటాడి వేధించే ఓ విధీ! ఒక ఇంద్రజాలం చేయవా
కనులు చూడలేని కాంతిలో కాలిపోయేందుకు

కడదాకా కలిసుండే ఓ నీడా! ఇకనైనా అలసిపోవా
వేదనతో పాటూ మోస్తున్ననన్నూ సమాధిచేసేందుకు

వెన్నెల పూయించే ఓ జాబిలీ! ప్రతిరొజూ పున్నమైరావా
కుమిలి వాడిపోయిన ఎద కలువలు విరబూసేందుకు

ఉరుము విదిల్చే ఓ వర్షమా! వేగంగా ఇటు వురకవా
ఉప్పెనై ఎగసిపడుతున్న కన్నీటి ధారను దాచేందుకు     

12/12/2013

2 comments:

  1. మీ పాతకవితలకి ఇప్పటి వాటికి ఏదో వ్యత్యాసం విష్వక్సేనగారు....చాల బాగుంది కవిత పెయింటింగ్ కూడా.

    ReplyDelete
    Replies
    1. మార్పు అనివార్యం! పద్మా గారు

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...