జనవరి జగాన్నే జయించొచ్చనే భరోసానిచ్చింది
ఫిబ్రవరి పోరాటంచేసి సాధించమని వెన్నుతట్టింది
మార్చి మార్పును స్వాగతించి ముందుకెళ్ళమంది
ఏప్రెల్ ఎక్కడా తడబడకుండా వెనకడుగే వేయకంది
మే మంచితనంతో నెమ్మదిగా ఒక్కో అడుగేయమంది
జూన్ జరిగిపోయిన వాటికై చింతించడం ఆపేయమంది
జూలై జారిపడ్డ అడుగులను మరోసారి సరిచేసుకోమంది
ఆగస్ట్ అలుపెరుగక ఎంచుకున్న గమ్యాన్ని చేరుకోమంది
సెప్టెంబర్ సంతోషంతో అనుకున్నదేదైనా సాధించమంది
అక్టోబర్ ఆవేశం వదిలి ఆలోచనలకు పదును పెట్టమంది
నవంబర్ నూతనంగా ప్రపంచానికి పరిచయం చేసుకోమంది
డిసెంబర్ దారిచుపిన ప్రతి క్షణానికీ ధన్యవాదాలు
తెలపమంది
31/12/2013
సూపర్ గా రాసారు వినోద్ గారు.
ReplyDeleteనెలలన్ని నిండుగా కవర్ చేసారుగా ;-)
ReplyDelete