నిప్పుల ఉప్పెన కప్పుకొని
రక్కసి మూకల తప్పులను
పెను ముప్పుల
జ్వాలా మబ్బులను
ఒక్కొక్క కుప్పగా పెర్చేసీ
ఒక్కసారిగా కాల్చేస్తా.
ఘోరం భారం ఎక్కడ ఉన్నా
దూరాభారం అనుకోకుండా
నల్దిక్కులు నే వేదికేస్తా!
గిర్రున తిరిగే సుడిగాలుల్లో
రెక్కలు కట్టుకు వచ్చేస్తా!
హక్కుల ముసుగున బిగిసిన
నియంతృత్వ హుక్కులనే తొలగిస్తా!
కక్కుర్తి కుక్కల్ని తరిమేస్తా!
రాబందుల మెడలూ వంచేస్తా!!
మస్తిష్కానికి ఒప్పనిపిస్తే
ఏదేమైనా చెప్పేస్తా!
నా జోరు తగ్గినా
నోరు మగ్గినా
చెప్పిందే నే చేసేస్తా!!
చీకటి వెతికే చిరు దివ్వేల్లో
చిరునవ్వుల వెలుగులు చిందిస్తూ
చిందులు వేస్తూ వచ్చేస్తా!
అందర్నీ నే మెప్పిస్తా!!
ఆనందాన్నే పంచేస్తా!!!
27/12/2013
ఇలాంటి భావోప్రేరిత కవితలు చదివినప్పుడు మీలో విష్వక్సేనుడు విశ్వరూపం దాల్చాడేమో అనిపిస్తుందండి
ReplyDelete