మళ్ళీ లేస్తాను...
వీపున వేలాడే నా సమాధిని మోస్తూ
నేనెప్పుడూ నడుస్తూనే ఉంటాను.
బలిపశువుల్ని జీవచ్చవాలుగా మార్చని
శాసనాల అవశేషాలను ఆత్రంగా అన్వేషిస్తూ
అధికారదాహ అహంకారపు కాళ్ళు తడిపిన
రక్తపు అడుగుల జాడలను
మంచు ముళ్ళుగా మార్చేస్తూ
నేనలా నడుస్తూనే ఉంటాను.
ఆనంద మేఘం గర్చించి కన్నీరు కార్చేవేళ
సంతోష పుష్పం జలదరించి పన్నీరు చిలకరించేవేళ
నా అలసట సెలయేరై పారి
మున్నీరులో మునిగి ఆవిరైపోతుంది.
ఒక బాసటేదో స్మశానమై
నన్ను విశ్రాంతి తీసుకోమంటుంది.
మదిని మోతాదుకు మించి వాడకుండా
ఏ ఉరికొయ్యకి ఆహారంగానో
ఏ నిప్పు శయ్యకి అలంకారంగానో
అప్పుడు దింపుతాను వేలాడే నా సమాధిని.
అందులోనే నిద్రించి
అవసరమైనప్పుడు మళ్ళీ లేచి నడుస్తాను.
22/12/2013
chaala bagundi
ReplyDeleteThanks a Lot..
Deleteమీకెలా వస్తుందో ఈ భావనల ధార ....
ReplyDeleteఆలోచనలకు అంతు దొరకడం లేదు .
మీరొక ఇన్స్పిరేషన్ అని అంటాను .
" ఆనంద మేఘం ఘర్జించి
కన్నీరు కార్చే వేళ -
సంతోష పుష్పం జలదరించి
పన్నీరు చిగురించిన వేళ " ......
గొప్ప మాటలివి . ధన్యులు మీరు .
- శ్రీపాద
మీ నుంచి ఈ మాటలు విన్నాక నిజంగా ధన్యున్నేమో అనిపిస్తోంది. ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండి.
Deleteఏ ఉరికొయ్యకి ఆహారంగానో
ReplyDeleteఏ నిప్పుశయ్యకి అలంకారంగానో
వండర్ ఫుల్ వర్డింగ్స్
త్యాంక్యు!! పద్మార్పిత గారు..
Delete