పెళ్ళి కళ

పెళ్ళి పెళ్ళని పాకులాడితివన్నో
ఏళ్ళ బెమ్మచర్యము మంటగలిపితివన్నో

కన్నోళ్ళ కోరికంటూ మా అన్నో
కన్నీళ్ళ సంద్రాన్ని తాగుతున్నావన్నో

మూన్నాళ్ళ ముచ్చట కాదన్నో
వేన్నీళ్ళ వడగండ్లు మింగుతున్నావన్నో

కొత్త బంధాలనీ.. కోరి వచ్చారారనీ
భ్రమ పడకు మా ఎర్రి అన్నో
బంగారు భవిష్యత్తు బాయిపాలన్నో

లచ్చలొస్తాయనీ లచ్చిమొస్తాదనీ
శ్రమ పడకు మా పిచ్చి అన్నో
సంసార బాధేంటో సన్నాసినడుగన్నో

అయినదేదో అయ్యె
ఆదమరిచి నిదరోకు అన్నో
అలసిపోక నీళ్ళై పాలలో దూకేయరన్నో

చీర బాగుందంటే చంకనెక్కించుకుంటుందన్నో
నవ్వు బాగుందంటే నెత్తినెట్టేసుకుంటాదిరన్నో
తిన్నావా అంటే నిన్నూ గుండెలో దాచేస్తాదన్నో

16/12/2013


6 comments:

  1. పెళ్ళికాకుండానే ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి వినోద్ :-)

    ReplyDelete
    Replies
    1. సినిమాలు చూడట్లేదేటి! (పోకిరీ స్టయల్ లో.. ) త్యాంక్యు పద్మాగారు!!

      Delete
  2. భాషలో 'యాసను' సమకూర్చి - ప్రయాస పడకుండా
    మెప్పించారు ! భలె. బావుంది వినోద్ గారు -

    ..... శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. ప్రస స్పందన భలే ఉంది శ్రీపాద గారు.. నమస్సులు...

      Delete
  3. వద్దు వద్దంటూనే దూకే వలయం

    ReplyDelete
    Replies
    1. సుడిలో దూకి ఎదురీదక మునకే సుఖమనుకోవోవ్...

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...