రా! పరిగెడదాం!! నువ్వూ నేనూ..
నిశీది అంచున ఎగిరే కలల్ని
ఉవ్వెత్తున ఎగిసే అలలమై పట్టుకుందాం!
కాలం చేసిన గాయాల్ని
ఊహల రెక్కలు ఆడించి
భ్రమలో భ్రమరాలై మాన్పేద్దాం!
ఆశలు తొడిగిన మనసుకు
మిథ్యా లోకపు వసంతంలో
మైకపు మల్లెల్ని తురిమేద్దాం!
ఏ సంద్రమూ ముంచని సంకల్పంతో
ఏ సంశయమూ చేరని మదిలోయాల్లో
అలుపన్నది రాక ఆగకుండా పరిగెడదాం!
నీలో నాలో దాగిన తరిగిపోని ప్రేమకు
కనకాక్షరాలు కుమ్మరించిన
కొత్త కావ్యాన్ని బహుమతిగా ఇద్దాం!
రా! పరిగెడదాం!! నువ్వూ నేనూ..
21/12/2013
నిశీది అంచున ఎగిరే కలల్ని
ఉవ్వెత్తున ఎగిసే అలలమై పట్టుకుందాం!
కాలం చేసిన గాయాల్ని
ఊహల రెక్కలు ఆడించి
భ్రమలో భ్రమరాలై మాన్పేద్దాం!
ఆశలు తొడిగిన మనసుకు
మిథ్యా లోకపు వసంతంలో
మైకపు మల్లెల్ని తురిమేద్దాం!
ఏ సంద్రమూ ముంచని సంకల్పంతో
ఏ సంశయమూ చేరని మదిలోయాల్లో
అలుపన్నది రాక ఆగకుండా పరిగెడదాం!
నీలో నాలో దాగిన తరిగిపోని ప్రేమకు
కనకాక్షరాలు కుమ్మరించిన
కొత్త కావ్యాన్ని బహుమతిగా ఇద్దాం!
రా! పరిగెడదాం!! నువ్వూ నేనూ..
21/12/2013
" నీలో నాలో దాగిన తరిగిపోని ప్రేమకు కనకాక్షరాలు కుమ్మరించిన కొత్త కావ్యాన్ని బహుమతిగా ఇద్దాం! రా! " ........ అబ్బ ఎంత కమ్మగా ఉంటాయ్ మీ మాటలు
ReplyDeleteభగవంతుడు మీకు ఓ మంచి వరాన్ని ప్రసాదించాడు వినోద్.
ఎలాంటి అక్షరాలనైనా ఓ మంచి మాలగా అల్లగలువు.
చాలా బాగుంది మై డియర్ ... - శ్రీపాద
నా కవిత సంగతేమో నాకు తెలియదు కానీ, మీ కామెంట్ చెవిలో అమృతం పోసినట్లుంది... థాంక్స్ ఎ లాట్ .. శ్రీపాద గారు
Deleteఅందమైన అక్షరమాల అల్లి పారిపోవడం ఎందుకండి ప్రేమసామ్రాజ్యాన్నే ఏలుకోండి :)
ReplyDeleteతప్పక ఏలుకుంటా డియర్.. థాంక్స్ యోహాంత్ జి...
DeleteRunning is always good for health,,,,పరుగో పరుగు :-)
ReplyDeleteఅమ్మో! ఇది కుడా ఉందా!! థాంక్స్...
Delete