నాకు తెలుసు
నేను కోరుకున్నప్పుడు కాదు
నీకు అనిపించినపుడు మాత్రమే
నన్ను పలకరించడానికొస్తావని...
హృదయంలో తడిలేనప్పుడు మొలకెత్తిన
స్వార్థపు కలుపుమొక్కలు ఎండిపోయినపుడా...
జీవనాడిగోడల పగుళ్ళలోంచి స్రవిస్తున్న
ప్రేమధారల ప్రవాహాలు ఇంకిపోతున్నప్పుడా...
ముసుగులోంచి వెలివేయబడ్డ అపనమ్మకపు
అంచుల్లో క్రోధబీజాలు చిగురిస్తున్నప్పుడా...
ఆజ్ఞానపు కట్టుడురాళ్ళతో నిర్మించబడ్డ
ఆశయాలపునాదుల్లో స్థిరత్వం కోల్పోయినప్పుడా...
మరణమా...
అసలెప్పుడొస్తావో నికైనా తెలుసా?
నన్ను పలకరించడానికై
పాశంతో పనిగట్టుకు రావడానికి
నీకే సంధర్భం కావాలో చెప్పు..
కృత్రిమంగానైనా సృష్టించుకొని
నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను..!!
మరణాన్ని రమ్మని పిలవకండి సమయం వస్తే అదే వస్తుంది. ఏం మాటకామాటే కవిత బాగుందండీ.
ReplyDeleteకన్నులకి ఇంపుగా అమర్చావు వినోద్ బ్లాగ్ చాలా బాగుంది. కవిత కూడా నచ్చింది.
ReplyDeleteదిగులెందుకు రావలసిన వేళకే వస్తుంది.
ReplyDeleteవిష్వక్సేనుడుగారు...మీ బ్లాగ్ కొంగ్రొత్త అందాలతో మెరిసిపోతుంది. మీరు నవ్వుతూ చుక్కల్లో చంద్రుడిలా ఉన్నారు. :-) అందమైన మరిన్ని కవితలతో అలరిస్తారని ఆశిస్తున్నాము.
ReplyDelete