నా ఉదయం...


నేను లేవగానే 
నువ్వు నా పక్కనుండవు
అయినా నిద్రమత్తులోనే పరుపంతా తడుముతాను...

నీ పరువాల తాకిడికి
సిగ్గుతో కందిపోయిన మల్లెల్ని తప్ప
నిన్నస్సలు స్పృశించలేకపోతాను ...

కలబడ్డప్పుడు 
కుదుపుల్లో నలిగిన 
మెత్తటి రోజా పూరెక్కల వెక్కిరింపులు తప్ప
నీ ముద్దులు అందుకోలేకపోతాను ...

విరహంతో నేను కళ్ళు తెరవలేకున్నప్పుడు
అప్పుడే స్నానమాడివచ్చిన 
నీ తడి ఆరని కురుల్లోంచి
నా రెప్పపై జారిపడ్డ నీటిబిందువు
నన్ను తమకంతో మేల్కొలుపుతుంది...

నువ్వు గడుసుదనంతో కళ్లెగరేస్తూ
పెదాల దాహం తీరుస్తానని వచ్చి
మోసంతో కాఫీ ఇచ్చి
నన్ను మేల్కొలుపుతూ నవ్వుతావు చూడూ
అప్పుడే నీ చూపులో నేను సూర్యోదయం చూస్తాను...


3 comments:

  1. మీ నవ్వు డిజిటల్ పిక్ లో నవ్వు సేం టు సేం. అందమైన మధుర భావన మీ కవితలో విష్వక్సేనుడుగారు.

    ReplyDelete
  2. మీ ఉదయం ఒక అందమైన అమ్మాయి చేతి కాఫీతో ఆరంభం:-)

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...