లేచిపోదామన్నావ్...

వరించాను ఇద్దరం లేచిపోదామని విశాఖకు రమ్మన్నావ్..
వస్తే దరహాసమాడి దువ్వాడకు దౌడు పెట్టమన్నావ్..
అరమూల మల్లెల్తో అనకాపల్లిలో ఎదురుచూస్తాన్నావ్..
లేవని ఏడిస్తే యలమంచిలి పట్నంలో తోడొస్తానన్నవ్..
నవ్వుతూ వస్తే నర్సీ పట్నంలో తారసపడతానన్నావ్ ..
తాపత్రయంతో నేనొస్తే తుని లో తళుక్కుమంటానన్నావ్..
అలసిపోయి ఆశలావిరైతే అన్నవరంలో వరమిస్తానన్నావ్..
పొరపాటయ్యింది పిఠాపురానికి వేగంగా వచ్చేయమన్నావ్..
సంతోషంతో వస్తే సమర్లకోటంటూ సహనాన్ని పరిక్షించావ్..
అలసిపోయి ఆగిపోతే అనపర్తిలో నా ఆశలు తీరుస్తానన్నావ్..
ధీమాగా దరిచేరబోతే ద్వారంపూడిలో దర్శనముతానన్నావ్..
రాంగ్ రూట్లో శరవేగంగా వస్తే రాజమండ్రిలో సరండరౌతానన్నావ్..

డౌటొచ్చి ఏంటీ ఊర్లన్నీ అని మ్యాప్లో వెతికితే..
తిరుమలా ఎక్స్ప్రెస్ రైలెక్కి గుండుకొట్టించుకోమన్నావని అర్థమైంది...

7 comments:

  1. నాకు తెలిసి ఇలా బ్లాగ్ లో మరొక్కరు మాత్రమే వ్రాయగలరు.....మీరిద్దరు ఒకటేనా :-)

    ReplyDelete
  2. :-)లేచిపోవడంకన్నా చేయిపట్టుకుని పారిపోవడం బెటరేమో !

    ReplyDelete
    Replies
    1. వస్తేగా తను.. ఆటపట్టిస్తోంది. :-)

      Delete
  3. బాగుంది ప్రయాణంలో పడిగాపులు

    ReplyDelete
  4. గుండుకొట్టించుకొన్నాకైనా...
    సిగను బొండుమల్లెలు పెట్టించుకొంటుందా...

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...