మంత్రమేస్తావెందుకు ?



వెళ్తూ వెళ్తూ విరహవిషం ఇచ్చి చంపేస్తావు.
వచ్చీరాగానే అమృతాధరాలతో స్పృశించి బ్రతికిస్తావు.
ఇదేంటని అడిగితే
" నువ్వు నావాడివి. ఆమాత్రం హక్కులేదా? "
అంటూ ప్రేమ మంత్రమేస్తావు.
" నువ్వీశ్వరివా? బ్రాహ్మిణివా? " అంటే..
అలిగి మూర్చపోయిన హృదయంపై
నీ మునివేళ్ళతో సుతారంగా రాస్తూ
గోముగా నేను నీదాన్నే కదా అంటావు.
ఇంకేంచేయను .....
చిన్నపిల్లాడిలా నీ ఓడిలో ఒదిగిపోవడం తప్ప...
దొంగలా నీ మనసులో దూరి తిష్టవేడం తప్ప...

8 comments:

  1. ఆమె ఎవరో కానీ చంపి బ్రతికిస్తుంది అంటే మీకు ఆమె సంజీవనియే.....:-)

    ReplyDelete
    Replies
    1. అయితే.. ఆమే నా సంజీవని అంటారా...

      Delete
  2. ఆ మంత్రమేసిన మంత్రగత్తెను బంధించి మనసు చెరసాలలో పెట్టేసెయ్యండి

    ReplyDelete
    Replies
    1. ఫ్రీడం లేదని లేచిపోతే... :-))

      Delete
  3. Replies
    1. మీ కామెంట్ బాలేదు. పొగడచ్చుగా...

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...