నీకిది న్యాయమా ??



నువ్వెందుకో నన్ను నువ్వనుకొని
అద్దానికి బదులు నా కళ్ళలో చూస్తూ
చలనం లేకుండా ఉండిపోతావు.
చలించని నా హృదయానికి చలిపుట్టేలా
చుంబనాల చక్కిలిగింతలు పెడతావు.
చీరకట్టు అందాలతో రెచ్చగొడుతూ
చిలిపి భావాలని అధరాలపై ఒలికిస్తావు.
నీకిష్టమని పంచెకట్టులో వచ్చి మంచమెక్కితే
అసలు కట్టుకోవడమే సరిగ్గా రాదని
ఇంకా చిన్నపిల్లడివేఅంటూ చాపచుట్టేస్తావు.
నీకిది న్యాయమా ??

1 comment:

  1. నువ్వెందుకో నన్ను నువ్వనుకొని
    అద్దానికి బదులు నా కళ్ళలో చూస్తూ.....వెతికే కొద్ది వింతభావాలెన్నెన్నో

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...