ఎదురుచూపు...

14




నువ్వు నాకోసం ఎదురు చూసే క్షణాన,
నన్ను నేను ఖాళీ చేసి ఉంచుతాను.
నా నుండి నేను వీడిపోయి
నువ్వెప్పుడు నాలో నిండుకుంటావని
శూన్యమై వేచిచూస్తాను.
నా హృదయాన్ని అద్దంలా పరచి,
నేనైన నిన్ను నాలో ఒంపుకుంటాను.
నీ ఎదురుచూపుల్లో
నన్ను కౌగిలించుకున్న కాలాన్ని
పవిత్రంగా నా జీవితపు గోడలపై లిఖిస్తాను.
స్వచ్చమైన నా మనసుని దోసిలిపట్టి
నీవైన నన్ను నేనే అభిషేకిస్తాను.

04-04-2014

4 comments:

  1. "నన్ను కౌగిలించుకున్న కాలాన్ని
    పవిత్రంగా నా జీవితపు గోడలపై లిఖిస్తాను."

    జీవితాన్ని పిండి ..... ఆకళింపు చేసుకున్న అనుభవం నేర్పిన మాట లేమో ఇవి.
    చాలా బాగా అల్లావ్ నీ భావనలను ఇంపుగా..
    మరింత సొంపుగా . భళా వినోద్
    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. అంతా మీ అభిమానం ... థ్యాంక్స్ అ లాట్..

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...