ఓయ్ మామా...




అట్టా చుట్టేయమాకు మొద్దు మామ
నాకెట్టో అయిపోతోంది వద్దు మామ

కోరికంత అణచుకోరా కొంటె మామ
కాలుజారితే కష్టమంట మొండి మామ

మీద మీద పడతావు మోటు మామ
నెమ్మదైతే రేయంతా స్వీటు మామ

ముద్దులంటికి పద్దురాస్తే ఎట్ట మామ
సరసంలో లెక్కలేంటి మట్టి మామ

వద్దంటే కావాలని ముద్దపప్పు మామా
హద్దుదాటితే లొంగిపోనా చురకత్తి మామా

6 comments:

  1. మామ అని ముద్దుగా పిలిచిన మరదలో లేక మేనకోడలో మాంచి తెలివైన చిన్నది :-)

    ReplyDelete
    Replies
    1. వరసేదో తెలియక తికమకపడుతున్నాను సంధ్య గారు ... :-) కత్తిలాంటి చిన్నదే...

      Delete
  2. మామ పై భలే మోజు కామోసు :-)

    ReplyDelete
  3. "మామ , మామా......" అంటూ అందంగా పలికించిన మీ భావాలు ముచ్చటగా ఉన్నాయి .
    ఇంతకీ సంగతేంటి వినోద్ అలా పిండేశావ్ చిన్నదాని ప్రేమను..
    బాగుంది. బాగుంది

    * శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. ఎంతో పెద్ద స్కెచ్ వేస్తె గానీ దక్కలేదండి ... ఆ చిన్నదాని ప్రేమ.. త్యాంక్యు సో..... మచ్

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...