నిరీక్షణలో...



నిగూఢానికీ నమ్మకానికి నిచ్చెనేసి
నడిమధ్యన నిరంతరమూ నలిగిపోతున్నా !
నా నీడే నకిలీదని నంజిలిపడుతున్నా !!

నా నగవే నడిరేయి నక్షత్రమని
నా నడతే నడిప్రొద్దు నీటిబొట్టని
నాకు నేనే నచ్చకున్నా
నేటికీ నే నటియిస్తూవున్నా !!

నడుమంత్రపు నెయ్యములో
నలిమేనిదొరనై నేను
నడిజామున నలినముతో నర్తిస్తూవున్నా !
నిచ్చెలువ నైజముతో నూత్నమౌతున్నా !!

3 comments:

  1. మీకు మీరే నలిపోతూ అన్ని త్యాగాలూ మీరే చేసేస్తూ క్రెడిట్ అంతా మీరే కొట్టేయాలని కాకపోతే ఏంటి.....ఇంత స్వార్థమా ఈ నిరీక్షణలో. :-)

    ReplyDelete
    Replies
    1. క్రెడిట్ కొట్టేస్తే... కోటి రూపాయల కట్నమోస్తుందండి బాబు... అందుకే నా తాపత్రయం

      Delete
  2. కవిత లోని మాధుర్యాన్ని ఆస్వాదించడంలో .......
    నీ కవితలో ఎన్ని "నా , నీ " లున్నాయో లెక్కించలేక పోయా.
    అసాధ్యుడివి వినోద్.
    ఇలా ఆకట్టుకుంటే ఎలా ? ........

    *శ్రీపాద

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...