ఆమె రోజూ నాముందు నగ్నంగా నిలబడుతుంది.
తన హృదయాన్ని పెనవేసుకున్న
ప్రేమలతని నాకే బహిర్గతం చేస్తూ
మనసు పొరలు విప్పి
మరింత నగ్నంగా, అప్పుడే పుట్టిన కాంతి పుంజ్యం లా
నా ముందు నిలబడి తధేకంగా చూస్తుంది.
నగ్నత్వం తన దేహంలోలేదు,
తర్కించే నా మనసులో ఉందంటుంది.
కోర్కెలు కాలానికి అతీతం కాదంటూనే
కోరి మరీ కళ్ళెం వేస్తానంటుంది.
కైపెక్కించే కళ్ళతో నన్ను కవ్విస్తూ కాల్చేసి,
మరుక్షణమే తన స్పర్శతో బ్రతికించుకుంటుంది.
నా జీవిత దస్త్రంలో
మిగిలిపోయిన కాగితాన్ని తీస్కొని
మరువలేని జ్ఞాపకాలతో నింపేస్తుంది.
నింపేసిన కాగితాన్నీ
వెళ్ళిపోతూ వెంటపెట్టుకుని పోతుంది.
మనసులో అందంగా ముద్రపడ్డ
అందమైన అక్షరాలను తేరిపారా చూస్తూ
దస్త్రంలో మరో తెల్లకాగితాన్ని
అమాయకంగా అతికించి
ఆమె దస్తూరికై రేపటికోసం వేచిచూస్తాను.
ఇవాళ మాత్రం ఆమె ఊహల్లో దాగి
ఊపిరిగా మారిపోతాను.
10-04-2014
తన హృదయాన్ని పెనవేసుకున్న
ప్రేమలతని నాకే బహిర్గతం చేస్తూ
మనసు పొరలు విప్పి
మరింత నగ్నంగా, అప్పుడే పుట్టిన కాంతి పుంజ్యం లా
నా ముందు నిలబడి తధేకంగా చూస్తుంది.
నగ్నత్వం తన దేహంలోలేదు,
తర్కించే నా మనసులో ఉందంటుంది.
కోర్కెలు కాలానికి అతీతం కాదంటూనే
కోరి మరీ కళ్ళెం వేస్తానంటుంది.
కైపెక్కించే కళ్ళతో నన్ను కవ్విస్తూ కాల్చేసి,
మరుక్షణమే తన స్పర్శతో బ్రతికించుకుంటుంది.
నా జీవిత దస్త్రంలో
మిగిలిపోయిన కాగితాన్ని తీస్కొని
మరువలేని జ్ఞాపకాలతో నింపేస్తుంది.
నింపేసిన కాగితాన్నీ
వెళ్ళిపోతూ వెంటపెట్టుకుని పోతుంది.
మనసులో అందంగా ముద్రపడ్డ
అందమైన అక్షరాలను తేరిపారా చూస్తూ
దస్త్రంలో మరో తెల్లకాగితాన్ని
అమాయకంగా అతికించి
ఆమె దస్తూరికై రేపటికోసం వేచిచూస్తాను.
ఇవాళ మాత్రం ఆమె ఊహల్లో దాగి
ఊపిరిగా మారిపోతాను.
10-04-2014
మళ్ళీ మీ స్వంత బాటలోకి వచ్చారు వినోద్ గారూ !
ReplyDeleteఇంత మంచి భావాలను కుదించి కావ్యాన్నందిచడంలో మీకు మీరే దిట్ట.
కవిత చాలా బాగా కుదిరింది.
"మనసులో అందంగా ముద్రపడ్డ
అందమైన అక్షరాలను తేరిపారా చూస్తూ
దస్త్రంలో మరో తెల్లకాగితాన్ని
అమాయకంగా అతికించి
ఆమె దస్తూరికై రేపటికోసం వేచిచూస్తాను.
ఇవాళ మాత్రం ఆమె ఊహల్లో దాగి
ఊపిరిగా మారిపోతాను."
ముగింపు చాలా అందంగా చేసారు .
అభినందనలు మిత్రమా ..
*శ్రీపాద
నిజానికి నా స్వంత బాట ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎన్నీయల్లో... శ్రీపాద గారు. నమస్సులు మీ హృదయపూర్వక ఆదరాభిమానానికి.
Deleteఇదే మీ స్టైల్, మమ్మల్ని బంధించిన భావాక్షరాలు కూడా ఇవే.....కొనసాగించండి ఇలాగే
ReplyDeleteమీకు నచ్చినట్లు రాయాలా?? లేదా నాకిష్టమొచ్చినట్లు రాయాలా?? క్లారిటి ఇవ్వండి అర్పితా జి
Deleteచాలా బాగుంది
ReplyDelete