మన సుధీర్ఘ ప్రయాణపు నిట్టూర్పు విడిచిన
వాయుప్రవాహం
వసంత కోయిలకు పోటీగా
వెదురువనాల్లో దూరి వేణుగానాలాలపిస్తోంది.
వేసవి చిచ్చులు రాల్చిన నీ కొపపు నిప్పు కణికలు
తనువంతటినీ తడిమి తగలబెట్టినా
మనసు శితలంలో మంచుముక్కలా చల్లబడుతోంది.
నా గుబులు గుండె గవిలో మిణుగుర్లా మెరిసిన సందేహానికి
సమాధి కట్టిన సంశయమేదో
మేధోసంపత్తికి అసంతృప్తిని మిగిల్చింది.
చవకబారు తెలివితేటలు వికటించి
చిక్కి శల్యమైన నా సందేహ దేహం కాస్తా
శిధిలమై శిలాజంగా నిర్వీరమైపోయింది.
పవిత్రంగా నిర్మించుకున్న మన ప్రేమవంతెన మాత్రం
రామసేతులా కలల అలలపై తేలియడి
సజీవంగా మిగిలిపోయింది.
ఇవాల్టి ప్రేమను రెట్టించి
రేపటికి మరింతపొందడానికని నిన్నను నెట్టేసి
కొత్త ప్రభాతమేదో ఉత్సుకతతో ఎదురుచూస్తోంది.
రా... ఎంచక్కా రేపు మళ్ళీ పుట్టేద్దాం!!
"నా గుబులు గుండె గవిలో మిణుగుర్లా మెరిసిన సందేహానికి
ReplyDeleteసమాధి కట్టిన సంశయమేదో
మేధోసంపత్తికి అసంతృప్తిని మిగిల్చింది" ఎంతటి నిగూఢ భావమో ఈ కవితలో...
ధన్యవాదాలు సంధ్య శ్రీ గారు... కొత్తగా వచ్చి నా కవితలను కుమ్మేస్తున్నారు.... త్యాంక్యు!!
Deleteపుట్టుట గిట్టుటకే....తిరగరాసి పుట్టేయండి పుట్టేయండి
ReplyDeleteరండి మీరు కూడా ... కలిసి పుట్టేద్దాం!! :-)
Deleteరా....మళ్ళీ పుట్టేద్దాం అంటే రెడీ!
ReplyDeleteరాగం రంగిపజేస్తుందని గ్యారంటీ ఇస్తే...
కోపకణికల్ని ప్రేమమంచులో తడిపేస్తానంటే...
సంశయాలకి సమాధానమే చెప్పి సేదతీరిస్తే...
నిర్జీవమైన శిలకి విలువైన వన్నెలద్దుతానంటే...
ప్రేమవంతెననే ప్రతిష్ఠాత్మక వంతెనగా మలిస్తే...
నిన్న...నేడు...రేపు...చచ్చిపోయి పుట్టేస్తుంటాను!
అయితే ఒకే ... రండి రండి... త్వరగా
DeleteSuper Vinod:-) great words:-)
ReplyDeleteThank You Sruthi :-)
Delete" పవిత్రంగా నిర్మించుకున్న మన ప్రేమవంతెన మాత్రం
ReplyDeleteరామసేతులా కలల అలలపై తేలియడి
సజీవంగా మిగిలిపోయింది. "
ప్రేమ పవిత్రతను ఎంతో గణనీయంగా చెప్పావ్ .
నీ కలం నుండి వచ్చిన మరో మంచి కవిత ఇది వినొద్.
అభినందనలు.
* శ్రీపాద
నా కవితలను ఆదరించి ఆస్వాదిస్తున్న మీ హృదయానికి నమస్సులు _/\_
Delete