ఈ దినం ఎంతో
శుభమైనదో
మరింత శోభాయమైనదో
కావొచ్చు...
ఇంటి వాకిళ్ళలో
కొన్ని గంధపు పరిమళాలో
పెరట్లో కొన్ని
రంగుల సీతాకోకలో వీయవోచ్చు....
నీ ఎదురు చూపులు ద్వారానికి
వొక గడపగానో
గోడకి ఒక
కిటికీగానో మారవచ్చు...
నీ ధ్యాస గ్యాస్
స్టవ్ పై మరిగే ఎసరో
పొంగిపోతున్న
పాలో కావొచ్చు....
నీ ఆశ దేవుని
గదిలో పవిత్రమైన ప్రసాదమో
గదిని ఆవరించిన అగర్బత్తీ
ధూపమో కావొచ్చు....
నువ్వు ఒక
దిగ్భ్రాంతికర హృదయంతోనో
సంభ్రమాశ్చర్యపు అయోమయ
మనస్తత్వంతోనో
ఇంటి
మూలల్లో...మంచాల్లో..ఊయల్లో...
అలా అటూ-ఇటూ
ఒంటరి సమూహంగానో
ఆవరించిన శూన్యాన్ని
ఛేదించే గాలి కెరటంలానో
మెల్లమెల్లగా
రోజంతా పరుచుకోవోచ్చు....
నీకు అలసటా
రాదు...ఎదురుచుపుల్లో విసుగూ రాదు
దాహమూ
వేయదు....వెన్నంటే పొట్టలో ఆకలీ కలుగదు
ఆఫీస్ నుంచి
నేనోచ్చేసాను
నీ క్రమానుగత వొక
వొంటరి అలవాటు నుంచి
ఒక్కసారి దూరమై
కాస్తంత ఎంగిలిపడరాదూ...
నువ్వు ఒక దిగ్భ్రాంతికర హృదయంతోనో
ReplyDeleteసంభ్రమాశ్చర్యపు అయోమయ మనస్తత్వంతోనో
అలా అటూ-ఇటూ ఒంటరి సమూహంగానో...చివరికి ఏమౌనో :-) excellent kavita
to whom she is feeding vinod.
ReplyDeleteexcellent post
ReplyDeleteవాహ్...ఆకలిగాలేదు☺
ReplyDelete