ఏదో క్రొత్తదనపు కాంక్ష
గుండెవాకిళ్ళను దాటుకుంటూ
కళ్ళలో ప్రత్యక్షమై
ఒక ప్రత్యక్ష పొరుకి సన్నద్ధమౌతున్నట్టు
చుట్టూ అలుముకున్న ఏదో యుద్ధ వాతావరణం...
'సేవ్ కరెంట్' అంటూ వెలుతురు ఆర్పేస్తూ
ప్రేమని పునరుధ్ధరించే
ఒక శృంగారపు ఎత్తుగడతో
నువ్వు నా ఒళ్ళోకి వాలిపోయి
నన్ను మెత్తగా హత్తుకున్న స్పర్శ...
దేహాల రాపిడితో జనించిన
కొన్ని వోల్టుల విద్యుత్తుతో
ఇరువురి భావాలను బదిలీ చేస్తూ
దేహమొక ఒక ప్రేమ ట్రాన్స్ఫార్మర్ లా
మారిన మన ఒక భంగిమ...
రసవత్తర పోటీలో సింబాలిగ్గా
మనసుల తీసివేతల్లో శేషంగా
దేహాల కలబోతాల్లో లబ్దంగా అంతా ప్రేమే...
జీవితం కళతో ప్రయాణించడానీకో
మనసుకూ దేహానికీ ఒక సుఖమనే మోక్షాన్ని ప్రసాదించడానికో
ఇది అంతా ఇంకొంచెం మెరుగైన పనే...
రహస్యంగా దాచబడ్డ అతి గొప్ప పనే...
మరో అధ్బుతం జరిగినట్లుంది
ReplyDeleteగెలుపు ఓటములు ఏవరివైనా
ReplyDeleteరహస్యయుద్ధం అదరహో అదరహా
మీ పదాలు మనసులో పరిభ్రమిస్తుంటాయి చదివిన కొన్నాళ్ళ వరకు వీడిపోవు.
ReplyDeleteమీ కవితలు నాకు ఎప్పుడూ విస్మయంతో కూడిన విజ్ఞానదాయకాలే.
ReplyDeleteఇంతకీ యుధ్ధం ఎవరితో ఎప్పుడూ ఎలా చేసినట్లు. మొత్తానికి మెప్పించావు.
ReplyDeleteయుద్ధమా ???
ReplyDeleteమీ కవితలు అధ్భుతం
ReplyDelete