అంతరంగంలో అగాధమంత బాధను
కుత్తుక దాటనివ్వకుండా
విరిసిన పెదవులపై ప్రహసనాలనే
వ్యసనంగా చేసుకుని బ్రతుకుతున్నపుడు
వొక అసంపూర్ణ వర్ణచిత్రంలా
మనసులో ఏదో అసంతృప్తి...
మదిలో మూగబోతున్న
కొన్ని భావాల వెలితిని
వెతికి వెతికి వెలికితీయాలనే
వొక జిజ్ఞాశాపూర్వక వెంపర్లాట...
జీవితమనే జీవనదిలో
ఆశయాల్ని ఒడ్డుకు నెట్టేసే కొన్ని అలలూ...
కొన్ని సహాయాలకు ప్రతీకగా
కృతజ్ఞతల ఒడ్డున కట్టబడ్డ ఇంకొన్ని ఆలయాలూ...
మనశ్శాంతిని మర్మగర్బంగా యిముడ్చుకోలేక
తృప్తీ - అసంతృప్తీల నడుమ
వొక యెద పడుతున్న నిశ్శబ్ధ సందిగ్థత ...
ఆంతరంగిక ఆవేదనను అలవోకగా అంతర్లీనంగా అనంతమైన ఆలోచనలతో అల్లిన తీరు శ్లాఘనీయం వినోద్ గారు
ReplyDeleteకృతజ్ఞతల ఒడ్డున కట్టబడ్డ ఇంకొన్ని ఆలయాలూ
ReplyDeleteఎక్సలెంట్ రాస్తావు బ్రదర్ నువ్వు.
మనశ్శాంతిని మర్మగర్బంగా యిముడ్చుకోలేక..ఇదెలా సాధ్యం?
ReplyDeleteటైటిల్ వెరైటీ
ReplyDeleteకవిత ఇంకా వెరైటీ