ప్రేమ ప్రయోగశాల...


అగాధాన్ని దాచుకున్న నీ కళ్ళలో
అకస్మాత్తుగా పడేసుకున్న నా మనసుని
ఈ రాత్రికి కొంచెం వెతుక్కొనివ్వు....
దేహానికి దేహాన్ని అప్పగించి
సున్నితపు స్నేహపరిమళంతో
నీ లోలోన నన్ను కనుగొననివ్వు...
కొన్నేళ్ల శూన్యాన్ని బద్దలుగొట్టి
నన్ను నీ ఊపిరి శబ్దాల్లో దాచుకొని
కొన్నాళ్ళు నీలో మొలకెత్తనివ్వు...
మెత్తటి నీ చేతుల్లో నా మొహాన్ని ఎత్తుకొని
మోహంతో కొన్ని ముద్దుల్ని జల్లెడపడుతూ
నీ ప్రేమని నా గుండెల్లో రాలనివ్వు...
జీవితపు ప్రయోగశాలలో
మరపురాని కొన్ని ఆప్యాయతలను
ఈ నిశిరాత్రుళ్ళలో నన్ను సృష్టించనివ్వు...

5 comments:

  1. బాగుంది మీ కవిత.

    ReplyDelete
  2. నీ లోలోన నన్ను కనుగొననివ్వు...sensitive feel.

    ReplyDelete
  3. ప్రేమ ఎంత మధురమో కదా..అబ్బుర పరచినారు

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...