కన్నీటిని సిరాగా పోద్ద్దామంటే;
చీకటిని రాత్రి మెత్తగా హత్తుకుంది!
కన్నీటిని వదిలి కౌగిలించుకోమంది!!
వేదన్ని కాగితాల్లో రాద్దామంటే;
వెన్నెల తెర వింతగా విస్తరించింది!
వేదన్ని వెలుగులో వదిలేయమంది!!
బాధల్ని అక్షరాల్లో బంధిద్దామంటే;
మంచుపొర చల్లగా అలుముకుంది!
బాధల్ని తుషారంలో తుంచేయమంది!!
అక్షరాలే దొరక్క
రాతికలాన్నే మోస్తూ
అసలు మనసే లేని నేను
బ్రతికున్న శవమై పరిగెడుతున్నా!
నల్లటి నా నీడపై నేనే సవారీ చేస్తున్నా!!
19/12/2013
చీకటిని రాత్రి మెత్తగా హత్తుకుంది!
కన్నీటిని వదిలి కౌగిలించుకోమంది!!
వేదన్ని కాగితాల్లో రాద్దామంటే;
వెన్నెల తెర వింతగా విస్తరించింది!
వేదన్ని వెలుగులో వదిలేయమంది!!
బాధల్ని అక్షరాల్లో బంధిద్దామంటే;
మంచుపొర చల్లగా అలుముకుంది!
బాధల్ని తుషారంలో తుంచేయమంది!!
అక్షరాలే దొరక్క
రాతికలాన్నే మోస్తూ
అసలు మనసే లేని నేను
బ్రతికున్న శవమై పరిగెడుతున్నా!
నల్లటి నా నీడపై నేనే సవారీ చేస్తున్నా!!
19/12/2013
మీకేల ఇంత వేదనా, నిరాశా నిట్టూర్పులు..
ReplyDeleteచెరగనీయకండి పెదవులపై నవ్వుదొంతరలు
ఎప్పుడూ నవ్వితే.. పిచ్చోడనుకుంతారేమో...
Deleteకవిత మొత్తంగా బాగుంది. వేదన కాస్త ఎక్కువగానే ఉంది
ReplyDeleteమీ కామెంట్ మాత్రం చాలా బాగుంది. త్యాంక్యు! :-)
Deleteమనసు ఉంది కాబట్టే ఇంత అందంగా రాయగలిగారు
ReplyDeleteఅవునేమో! నాకు ఇంకా సందేహమే యోహాంత్... థాంక్స్!!
Delete