మంత్రకవాటం...


మలుపులు తిరిగే జీవిత చక్రం
మంత్రకవాటం తెరచింది!

బాధలు తీర్చే లోకం ఒకటి
బంధాలన్నీ తెంచింది!

కనుమరుగయ్యిన కలలకు కాస్తా
కొత్త ఊయల కట్టింది!

ఊపిరి సలుపక ఊగిన తనువు
ఊర్ధ్వశిఖరం తాకింది!

ఆకలి తీరక వేచిన మనసు
ఆరని హారతి అయ్యింది!

రమ్మని పిలిచిన స్వాగతహస్తం
రంగుల రెక్కలు తొడిగింది!

గమ్యం ఎరుగని ఈ బాటసారికి
గమనం విలువను నేర్పింది!

28/12/2013



3 comments:

  1. చాలా మంచికవిత

    ReplyDelete
  2. చాలా బాగారాశావు వినోద్

    ReplyDelete
  3. మీ కలం చకచకా పరుగులు పెడుతుంది

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...