యధార్థ సంకేతం!



భయానకం బీభత్సం అంటే ఏంటని
అగ్నిపర్వత విస్పోటనాల్లో
గాండ్రించిన పెనుతుఫాన్లలో
భూస్తాపితం చేసే భూకంపాల్లో....
పంచభూతాల ఆక్రోశాల్లో అస్సలు తొంగిచూడకు!!

అణచివేయబడ్డ మదిలోయల్లోంచి
ఉబికివస్తున్న లావాల్లో చూడు...
కన్నీటి కెరటాలపైనుంచి
తీండ్రిస్తున్న ధు:ఖ కిరణాల్లో చూడు...
తీరని కోర్కెల రుగ్మతల్లోంచి
పుట్టుకొస్తున్న వికృతత్వాల్లో చూడు...

సహనం నశించివేయబడ్డ
కుంచిత హృదయాల్లో చూడు...
తీరం దాటక మరణించబడ్డ
ఉన్నత ఆశయాల్లో చూడు...
కలిసిరాని కాలంచే ఓడించబడ్డ
అలసిన మనసుల్లో చూడు...

కల్పిత శారీరకభాషలతో
గోతులు తవ్వే మనస్తత్వాల్లో చూడు...

6 comments:

  1. కల్పిత శారీరకభాషలతో
    గోతులు తవ్వే మనస్తత్వాల్లో చూడు...చూసి చూసి విసిగిపోయా. మంచి ఆవేశానుభవ కవిత వినోద్

    ReplyDelete
  2. మీ భావుకత్వం తారాస్థాయికి చేరితే ఇలానే ఉంటుందేమో!

    ReplyDelete
  3. తీరం దాటక మరణించబడ్డ
    ఉన్నత ఆశయాల్లో చూడు...
    కలిసిరాని కాలంచే ఓడించబడ్డ
    అలసిన మనసు...too good

    ReplyDelete
  4. ఏదో పూనకం వచ్చినంత ఆవేశం మీ కవితలో...ప్లోలో బాగా వ్రాసారు

    ReplyDelete
  5. Chala. Baga rasaru. Pustakalu emayinaa achhu vesta.? By the way , mas uru guda me ure.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...