ఎదపలకని నిష్కల్మషమైన మాటలతో
ఏనిష్కటమైన కవిత్వాన్ని రాయను?
ఎడతెరిపిలేని ఎదభావాల ఆలాపనలో
ఏరాగం ఎంచుకొని రంజింపచేయను?
ఎడబాటు రాల్చిన కన్నీటి ఓదార్పుతో
ఏరోగముందని ఉపశమనం చెందను?
ఎదురుపడిన ఓటమి గుణపాఠంతో
ఏదోషముందని పరిహారం చెల్లించను?
ఎండమావి మిగిల్చిన నిస్సహాయతలో
ఏకుటిలత్వం దాగుందని నిందించను?
ఎదగనట్టి అపరిపక్వపు ఆలోచనలలో
ఏకపటం దాగుందని వేలెత్తిచూపను?
ఎదురీది అలసిన ఈ జీవనయానంలో
ఏంసాధించానని ఆత్మ తృప్తి చెందను?
పలకలేని పదాలతో కుమ్మేశారు పోయం ని. :-) జైహో
ReplyDeleteఅయ్యబాబోయ్...తెలుగులో ఇన్ని కష్టమైన పదాలు ఉన్నాయా! మొత్తానికి అమ్మాయకంగా ఇన్ని విషయాలు చెప్పారు.
ReplyDeleteGood poem but few words required telugu dictionary.
ReplyDeleteవినోద్ ఇంకేం రాసి మమ్మల్ని తికమక పెడతావులే. నీకు బోలెడంత జ్ఞానసంపద ఉంది. మంచి కవిత
ReplyDeleteటైటిల్ వెరైటీగా ఉంది అనుకుంటే కవిత మరింత వైవిధ్యంగా వ్రాశావు వినోద్
ReplyDelete