ఉన్మత్తవేదం!!



 ఉన్మత్త నృత్యంచేసే హృదయాన్ని
అదుపుచేసే బాధ్యతలు చేపట్టి
మానసిక వైవిధ్యానికి నిలువలేక
అలిసిపోయిన తార్కికవాదాలెన్నో...

నిశ్శబ్ధం నిండిన జీవిత గోడల్లో
మైలుపడ్డ మనసుల్ని మోస్తూ
నిస్సత్తువతో ప్రతిధ్వనిస్తున్న
సంశయాత్మక ఆలోచనాత్మలెన్నో....

ప్రతి మనసుస్పందనకీ ఒక భాష్యం
ప్రతి ఆలోచన వెనుక ఒక స్వార్థం
ప్రతి ఆత్మ అంతరాల్లో ఒక నైరాశ్యం
ప్రతి అనుభవసారానికి ఒక వైరాగ్యం

అంతుచిక్కని ఈ జీవన గమనంలో
అంతమైపోవడమే ఆఖరి గమ్యం!!




1 comment:

  1. ఏదో ఉన్మాదంలో వ్రాశావేమో అనుకున్నాను టైటిల్ చూసి, పస ఉంది వినోద్ కవితలో కొనసాగనీయి.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...