కవయుత్రితో ఓ రాత్రి..!


యుగాలనాటి శూన్యం బద్దలైనవేళ
నిశ్శబ్ధంలోంచి నిష్పాదించబడ్డ ఆమె
నిష్కల్మశత్వంతో నన్నాహ్వానించింది

ఆమె స్వచ్ఛమైన నవ్వులవెలుగు
పున్నమి వెన్నెల పరచిన దారిలా
నా యద పరదాలను తొలిచింది

ఒక్క నిమిషం అంతా ప్రశాంతత
నా చుట్టూ ఊహాతీత వ్యాకులత
కర్ణభేరి భరించలేని పూర్ణ నిశ్శబ్ధత

ఆత్రుత వొకవైపు
ఆశ్చర్యం వొకవైపు
ఆహ్వానంతో పులకించిన
అనిశ్చల హృదయానందం మరోవైపు
ఆమె ఆత్మీయత మాత్రం అన్నివైపులూ

ఐతిహాసిక పర్వమో
ఔన్నత్వపు గర్వమో
తెలియని మలుపేదో
ఇరువురి మధ్య వారధై నిలిచింది

అందుకేనేమో
కాలదోషం పట్టని కలయిక మాది
కలం కలిపిన కవితాబంధం మాది
కల్పనలకందని కమ్మని కథ మాది

3 comments:

  1. కాల్పనిక జగత్తులో కవయిత్రితో కలయకి బాగుంది.

    ReplyDelete
  2. ఇలా కవయిత్రి వెంటపడితే క్యారక్టర్ పెరిగిపోయి ఎత్తుకెదిగిపోతారు :-)

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...