ఒళ్ళంతా పుప్పొడి జల్లుకొని
పూలస్నానమాడావని పరవశించిపోకు
కీలాగ్రాల్లో జారవలసిన పుప్పొడిరేణువులు
నీ బాహుమూలాల్లోచేరి గంధాన్ని విరజిమ్మలేవు
అద్దంలో పరావర్తనాన్ని చూసి
అందంగావున్నావని సంబరపడిపోకు
తారుమారైన ప్రతిబింబపు కుడి ఎడమలు
నీ మనసులో దాగిన మర్మాన్ని బయటపెట్టలేవు
తాత్కాలిక ఆనందాన్ని పొంది
ఆత్మతృప్తి చెందావని సంబరపడిపోకు
కుదుటుపడ్డ తనువును మోసిన క్షణాలు
రెప్పపాటులో గాయపడ్డ మనసును శాంతపరచలేవు
ఇలా మీకు మీరే ముసుగు వేసుకున్నా
ReplyDeleteమీ ముసిముసి నవ్వులు మేము చూసేయగలం.:-)