అశ్రువులు రాలేవేళ
ఆయుష్షు తీరేవేళ
అస్తికలు కలిసేవేళ
ఆత్మగా మారినవేళ
సర్వం నేనై
నేనే సర్వాన్ని
స్వర్గమో నరకమో
శూన్యపు అంచుల్లో
నిశ్శభ్దంగా నీవద్దకు సమీపించి
నిదరోతున్న ప్రణయవీణను
మీటుతాను!
ప్రాణమున్నప్పుడు
పరిహసించబడ్డ నా ప్రేమభావాన్ని
అప్పుడు మనం ప్రకృతిలో ఐక్యమయ్యాక
మాసిపోని నీ మనస్సాక్షి
ఎదుట
బహిర్గతపరుస్తాను....
అప్పుడైనా నా ప్రేమను
గుర్తించు!
నన్ను నీతోనే ఉండనివ్వు!!
ఏంటో మనుషులు కరువైపోయారు లోకంలో.
ReplyDeleteఅంటే మీ అర్థం అమ్మాయిలు కరవయ్యారని కదా?
Delete