ఈ మనసు అనేది ఉంది చూడూ
అది గాజు పరదాల్లో చిక్కుకున్న
కోతిపిల్లలా ఆలోచిస్తూ వుంటుంది ...
వొక్కోసారి అనిపిస్తూవుంటుంది నాకు-
దాని చేష్టలు ఎంత విచిత్రమో కదా అని..
దీనికి ఎంత కాల్పనిక శక్తి ఉంటే మాత్రం
ఇన్ని అసంబద్ధ కొరికలా?
ఎంత క్షమాగుణం ఉంటే మాత్రం
ఇంత దాతృత్వమా?
ఎంత కాఠిన్యం ఉంటే మాత్రం
ఇంత కర్కశత్వమా?
వో పట్టాన అంతుచిక్కని విశ్వరహస్యాన్ని
గుప్పెడు స్థలంలో దాచుకున్న
కృష్ణబిలంలాంటి దీని శాస్త్రీయతను
నేను ఎంత శోధించినా అంచనా వేయగలనా?
ఓ మనసా...
బంధించేకొద్దీ విస్తరించే నీ వైశాల్యానికీ
విస్తరించేకొద్దీ బందీ అయ్యే నా సంకుచిత్వానికి
ఎన్నెన్ని భేషజాలో కదా!??
మనసు ఎల్లప్పుడూ మనకు వ్యతిరేకమే.
ReplyDeleteగాజు పరదా ఉన్నా ఒకటే ఊడినా ఒకటేనండీ.
ReplyDeleteమనసు పడే తిప్పలు మనకేం తెలుస్తాయి చెప్పండి.
ReplyDeleteబాగుంది మనసు ఘోష.
ReplyDeleteఎంత కాఠిన్యం ఉంటే మాత్రం
ReplyDeleteఇంత కర్కశత్వమా??? :)