అలుపులేని బతుకు ప్రయాణంలో
జీవితపు త్రోవంతా కనిపించని చీలికలే!
ఏది ఎండమావో తెలియని బంధాల నీడల్లో
సేదతీరే సమయమంతా తెలియని గుబులే!
కొన్ని ఆశల సౌధాల్లో
ఇంకొన్ని ఆశయాల మేఘాల్లో
యదలోతుల్లోంచి జారిపడే కలతల కన్నీళ్లు!
మనస్పర్ధల అలజడులతో ఉప్పొంగే భావావేశాల్లో
తుడిచిపెట్టుకుపోయే ప్రేమాభిమానాలు!
కోపతాపాల శత్రుసైన్యాన్ని
క్రోధావేశాల బలహీనతల్ని
ధనాత్మక ఆలోచనలతో జయించినపుడే కదా
అపార్థాల అడ్డుగోడలు తొలగి
దారంతా నిండిన సుమగంధాల పలకరింపులు
జీవితాన్ని ఇంకొంత దూరం
ఓపిగ్గా నెగ్గాడానికి దోహదం చేస్తాయి!
ఇలాంటి వ్యధాభరిత పోస్ట్లు మీకు ఎందుకండీ.
ReplyDeleteకట్టె కాలే వరకూ బ్రతుక్కు అలుపు లేదు.
ReplyDelete