నిన్ను దూరం
నుంచి కావలించుకుంటూ
నీ జీవితాన్ని
కావలిగాస్తూ
ప్రాణవాయువును కానుకిచ్చే
ఆకుపచ్చ హృది
అదిగో
అంతరించిపోతున్న ఆ అడవే!
నీకోసం గగన
శిఖరాలను కరిగిస్తూ
వురిమే మేఘాలను
వింజామరై కదిలిస్తూ
చినుకు రవ్వల్ని
నేలదించే అమృతవర్షిణి
అదిగో నువ్వు
నరికేస్తున్న ఆ అడవే!
మృత్తిక
లోతుల్లో ప్రేమవేర్లను పెనవేసి
నేలంతా పారవశ్యంతో
పరచుకుని
నీకు ఆహారాన్నీ
ఆహ్లాదాన్నీ పంచె ఆకుపందిరి
అదిగో నీదోపిడీకి
ఖాళీ అవుతున్న ఆ అడవే!
రోదించే కరువు
కన్నీళ్లు చూడలేక
మట్టికీ
మేఘానికీ వంతెనవేసి
నీ మనుగడకు
నీళ్ళను ధారబోసే నిచ్చెలి
అదిగో నువ్వు మరచిపోతున్న
ఆ అడవే!
వృక్షో రక్షిత రక్షితః
ReplyDelete