నిన్ను గాఢంగా ముద్దాడాలనిపించినపుడల్లా
యీ గులాబీ రేకులను అలా తుంచిపడేస్తూ
పూలపట్ల పరుషంగా పౌరుషాన్ని ప్రదర్శిస్తుంటాను
నాకు తెలుసు
యీ పూలను కొమ్మ నుంచి తెంపితే
నీకు ఇష్టం ఉండదు...
నా బ్లాక్మైల్ విరహాన్ని బ్లాక్ చేస్తూ
గెలాక్సీలు దాటే ఫ్రీక్వెన్సీలో
బిగుతైన కౌగిలింత కాసేపు...
అంతకన్నా బిగుతుగా పెదాలతో
చిలిపి చుంబనం ఇంకాసేపు
కనీసం జీవితపు మొదళ్ళు తెలుసుకునేలోపైనా
నీ మొత్తాన్ని నన్ను అర్థంచేసుకునేలా
నన్ను చిన్నగా నీలో వొంపేసుకో...
వయసు మంటల్ని ఆర్పుతానని
విరహాల వంటల్లో
మమతల మసాలా కలిపి
వలపు తాళింపులు వడ్డించావు...
ప్రేమలో యిన్నిన్ని ప్రవచనాలు వల్లించావు కదా
వో ప్రపంచ వచనం ఏదైనా కొత్తగా చెప్పవూ...
జీవితాన్ని ఇంకాస్త అర్థం చేసుకుంటాను...
మహాద్భుతం వలపుజోరు
ReplyDeleteప్రేమలో యిన్ని ప్రవచనాలు వల్లించావు.. :)
ReplyDeleteచాలా బాగుంది
ReplyDelete