ఇగ్లూ

మోయలేని కొండల్ని
ఎత్తుకోవాలనీ హత్తుకోవాలనీ
కండల్ని కరిగించీ రక్తాన్ని మరిగించీ
సడిచేయని మువ్వని సన్నని దారంతో
మెడకు తొడుక్కుని
వడివడిగా నడుస్తూ
ఘడియ ఘడియనీ అడుగుల్తో
వెనక్కి నెడుతూ
పిడుగులా ప్రకాశిస్తూ ప్రకోపిస్తూ
గమ్యమే కానరాని గుబురు దారుల్లో
ఒంటరి వానపామునై
ఆవేశాన్ని ఆలోచనలతో సంపర్గిస్తూ
మస్తిష్కపుటెడారుల్లో
మంచు ముక్కల ఇగ్లూలకు జన్మనిస్తూ
గదులు కడుతూ కూల్చేస్తూ
కూలబడుతూ గడ్డకడుతూ
దాహ సంద్రాన కొట్టుమిట్టాడుతూ
ఎప్పుడో ఒకసారి అర్ధాంతరంగా
ముగించేస్తా ఈ జీవితాన్ని

06/10/2013

4 comments:

  1. ఆవేశంలో కవితలా బాగుంటాయి ఇవన్నీ....కానీ ఆచరణలో వద్దండి :-) nice igloo pic

    ReplyDelete
    Replies
    1. ఆజ్ఞ ఆమోదయోగ్యం .. థాంక్యూ పద్మ గారు

      Delete
  2. అచ్చమైన తెలుగులో అందంగా రాశారు.

    ReplyDelete
    Replies
    1. అందమైన మెచ్చుకోలుకుకు అభివందనం .. యోహంత్ గారు

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...