నిద్ర కావాలి !

నాకు నిద్ర కావాలి.
సాయంత్రం సూర్యుడిలా ఆవలిస్తూ
రాత్రి నిద్ర పోయినట్లు కనిపిస్తాను.
నా కోసం మరో ప్రపంచం కళ్ళార్పకుండా
ఎదురుచూస్తూ ఉంటుంది.
ఇక్కడ మిమ్మల్ని భ్రమలో ముంచి
అక్కడి కళ్ళలో మునిగిపోతాను.
ఉన్న వెలుగునే వొలికిపోకుండా
ఎక్కడెక్కడో పంచేస్తూ ఉంటాను.
ఇప్పుడు నాకు అలసట వచ్చింది.
గాడంగా నిద్రపోయే రాత్రిలో
మరింత గాఢంగా నిద్రించాలి.
చీకట్లను బెదరగొట్టి
విశ్వాన్ని అర్థించే
బుడబుక్కలవాడి శబ్ధంలోని ఆంతర్యాన్ని
కలలుగనేలా నాకు ఓ మంచి నిద్ర కావాలి.
ఎవరైనా ఇస్తారా మరి?

10:06 07/10/2013

2 comments:

  1. అలా నిద్ర వస్తే ఇలా అర్థరాత్రి కమెంట్లెందుకు పెడతాం చెప్పండి ? :-)

    ReplyDelete
    Replies
    1. అయినా మన పిచ్చిగానీ అసలు ఏది పగలో ఏది రాత్రో అర్థమైతేగా ఎప్పుడు నిద్రపోవాలో తెలిసేది.
      ఈ జిగిబిగి వెలుతుర కాలంలో రాత్రి అయిందని అర్ధ్రాత్రి దాటితే గానీ తెలియడంలేదు. మీ తప్పేముందిలేండి. థాంక్యూ.

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...