హృదయమా! ఓ హృదయమా!! వెక్కి వెక్కి ఏడుస్తున్నావా?
ఎగసే కెరటాల కడలి నిక్షిప్తమైనదా నీ కన్నుల్లో?
ఏం గుర్తుకొచ్చాయని ఏడుస్తున్నావ్?
ఇంకిపొవా నీ కన్నీళ్ళు సెలయేటి ధారల్లా ఎడారుల్లో సాగినా కూడా?
ఎవరు గుర్తుకొచ్చారు నీకు? ఇంతకీ ఎవరు గుర్తుకొచ్చారు?
తన ఇల్లెక్కడంటే ఇప్పటికీ వేలు చాచి
ఊరవతల తల తిప్పే దళితులా?
తన ఆస్తేంటంటే బర్రెంకలపుటొంట్లో
కరిగిన కండల్ని చూపే కార్మికులా?
తన వృత్తేదంటే మదమెక్కిన దేహంతో
నడవలేక కళ్ళతో మంచాల్ని సైగ చేసే సోమరులా?
తన దారేదంటే బెల్టుషాపుల వైపు
పరిగెత్తే మత్తుటడుగుల తాగుబోతులా?
తన మాటేంటంటే అమాయకుల్ని
నట్టేట ముంచే గారడీలనే మధ్యవర్తులా?
ఏం గుర్తుకొచ్చాయ్ నీకు? అసలు ఏం గుర్తుకొచ్చాయ్ నీకు?
సమాజంతో సహవాసానికి నోచుకోక
చిత్తులేరుకుంటూ రోడ్లపై బలైన భావి పౌరుల
బాల్యాలు గుర్తొచ్చాయా?
అప్పు తీర్చలేక నమ్మిన నేలనమ్మి
ఆత్మహత్య చేసుకునే రైతన్నల తుది శ్వాసలు గుర్తొచాయా?
పట్టించుకోని ప్రభుత్వాశుపత్రుల్లో
పశువులై మ్రగ్గుతున్న దీనులార్తనాదాలు గుర్తొచ్చాయా?
క్షణికావేషానికి లోనై పశ్చాత్తాపంతో
కారాగారాల్లో క్రుంగుతున్న యావజ్జీవ ఖైదీల క్షోభలు గుర్తొచ్చాయా?
బందూకుల్తో సహజీవనం చేస్తూ మంచులెండల్లో
ప్రాణలు త్రుణప్రాయంగా త్యజించే జవాన్ల త్యాగాలు గుర్తొచ్చాయా?
నిక్కచ్చిగా నీకివే గుర్తొచ్చాయంటే ఓ హృదయమా! ఏడ్వు.
ఖచ్చితంగా నేనాపను. కుమిలి కుమిలి ఏడ్వు.
చేతలకంటే కోతలు నయమనుకుంటే ఏడ్వు.
ఏడిస్తే సమస్తం సమసిపోతాయనుకుంటే ఏడ్వు. దిక్కులు పెక్కటిల్లేలా ఏడ్వు.
ఏడిస్తే సమసిపోయేవేమీ లేకపోయినా కూసింత ఓదార్పుగా అనిపిస్తే ఏడ్వడమే మంచిదేమో;-)Just kidding.Good post
ReplyDeleteThank U :-)
DeleteGood one!
ReplyDeleteThanq
Deleteఏడుపొస్తే ఎవరైనా ఏడుస్తారు...దానికి ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అనే ఆడవాళ్ళని నమ్మకూడదంతే:)
ReplyDeleteAntE antaara..
Delete